10, డిసెంబర్ 2012, సోమవారం

బహిష్కృత మూలాల్లోకి 


నా ఉన్నతికి నేనే బలిపశువుని 
నా ప్రతిబింబానికి ప్రధమ శత్రువుని  
ఎవరెవరో ఏర్చికూర్చిన 
రంగురంగుల భావనల్లో 
నేనో ఊసరక్షేత్రాన్ని .

తరతరాల తపోవాంఛల్లో 
నన్నునేను కట్టడిచేసుకున్న
అసమర్ధ మూలసారాన్ని.

నేనొక పనిముట్టునని 
ఈ శతాబ్దం నాకిచ్చిన 
సారవంతమైన జ్ఞానం .

మదపుటెద్దుని మచ్చికచేసినట్టు
నన్నునేను లోబరుచుకోడం 
అత్యంత ఆధునిక  బానిసత్వం .

స్వేచ్ఛ ; నా తదనంతరం 
రెండు అధోనాగరికతల మధ్యన 
వేలాడే నా మాంసఖండం .







        



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి