రాతి శవపేటిక
గగుర్పొడిచే గరుకు రాతి స్పర్శ ,
నగ్న పాషాణం .
ఒత్తిగిలేందుకు స్థలంకాదు
చెప్పుకునేందుకు కాలంకాదు
అగోచర స్థలకాల అస్థిత్వం ,
అయోగ్య సమయ సందర్భం,
సంధిగ్ధం ;
దాహం .........
దాహం .
కఠినశిల స్రవించదు నీరు ; కన్నీరు
చిప్పిల్లదు ; చెమర్చదు కరుణ కరిగి ;
రాతిగుండె .
శిధిలమవదు , సరే
వజ్రమవదు, పోనీ
సారమివ్వదు
మృతశిల .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి