రసభరితం
చాలా వుండేది ఇంతకుముందు
తినడానికి తాగడానికిచావడానికి బ్రతకడానికి
మహానందం గణాలయుద్ధం
కొత్తపరిమళాలు ఆనంద వ్యాపకాలు
కొత్తపరిచయాలు నవీనబంధాలు
పరిమళభరితాలు సరికొత్తవ్యూహాలు
* * * *
దేముడు మరణించాడని
చెప్పిన మనిషి అర్ధం
మనిషికూడా మరణించాడని ,
అంతటివూహా తుత్తునియలైనాక
ముందెవరో ఎనకెవరో
తేలేదికాదు ఇదమిద్ధిమితంగా -
భగవంతుడులేని మనిషి
మనిషిలేని భగవంతుడు,
వూహకి వాస్తవాన్ని జతచేసిచూడాలి
వాస్తవానికి ఆర్ద్రతని అద్ది.
సమాధులు మిడిసిపడుతున్న
జీవన సంరంభంలొ
ఈ పాపాల చిట్టాల్ని పూడ్ఛాల్చింది
చివరికి ఎవరిగోతిలోనో
స్పష్టమయిందా ఇంతకీ !?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి