24, డిసెంబర్ 2014, బుధవారం

పడగనీడన

ప్రతి ఆత్మహత్యా చెబుతుంది 
మనిషి సంఘజీవి కాదని 
నటించడం అతని నైజమని 
మృత్యువు మరో తల్లి నీడని.

బూజుపట్టిన ఆకాశం కింద 
బుగిలిపోయిన భూగోళం మీద 
బాగా ముసలి వాడయ్యాడు మనిషి 
చాలా కాలమైంది , కళ్ళలో కపోతాలెగిరి. 

మధ్యయుగాల మనిషి 
ఎక్కడో గాడి తప్పాడు 
తోవమరిచాడు 
జారిపోయాడు. 

ఏం చేస్తాం మనమిక్కడ ? 
డాంబికం ప్రదర్శిస్తాం. 
తింటాం లొట్టలేసుకొంటూ 
అనాధప్రేత కళేబరాల్ని. 
ఇంతజేసీ సిగ్గులేకుండా 
వగుస్తాం ప్రారబ్ధం గురించి. 
గానుగెద్దుల్లా గమిస్తుంటాం 
మలమూత్రాల రొంపిలోకి. 

ఆత్మహత్యకు అనుమతి పొందాలి 
లేదంటే మిగుల్చుకోవాలి కాసిని కన్నీళ్ళు. 

" ఇది తప్పనిసరి జాగ్రత్త ఈ రోజుల్లో " 

                                                                             07/06/2008
  

3 కామెంట్‌లు:

  1. ఆత్మహత్యకు అనుమతి పొందాలి
    లేదంటే మిగుల్చుకోవాలి కాసిని కన్నీళ్ళు.

    " ఇది తప్పనిసరి జాగ్రత్త ఈ రోజుల్లో "

    Champesaru Sir, Naa midi midi gnananiki ee last lines baga thagilayi. adbhutham.

    రిప్లయితొలగించండి