ప్రతి ఆత్మహత్యా చెబుతుంది
మనిషి సంఘజీవి కాదని
నటించడం అతని నైజమని
మృత్యువు మరో తల్లి నీడని.
బూజుపట్టిన ఆకాశం కింద
బుగిలిపోయిన భూగోళం మీద
బాగా ముసలి వాడయ్యాడు మనిషి
చాలా కాలమైంది , కళ్ళలో కపోతాలెగిరి.
మధ్యయుగాల మనిషి
ఎక్కడో గాడి తప్పాడు
తోవమరిచాడు
జారిపోయాడు.
ఏం చేస్తాం మనమిక్కడ ?
డాంబికం ప్రదర్శిస్తాం.
తింటాం లొట్టలేసుకొంటూ
అనాధప్రేత కళేబరాల్ని.
ఇంతజేసీ సిగ్గులేకుండా
వగుస్తాం ప్రారబ్ధం గురించి.
గానుగెద్దుల్లా గమిస్తుంటాం
మలమూత్రాల రొంపిలోకి.
ఆత్మహత్యకు అనుమతి పొందాలి
లేదంటే మిగుల్చుకోవాలి కాసిని కన్నీళ్ళు.
" ఇది తప్పనిసరి జాగ్రత్త ఈ రోజుల్లో "
07/06/2008
NICE POEM................
రిప్లయితొలగించండిఆత్మహత్యకు అనుమతి పొందాలి
రిప్లయితొలగించండిలేదంటే మిగుల్చుకోవాలి కాసిని కన్నీళ్ళు.
" ఇది తప్పనిసరి జాగ్రత్త ఈ రోజుల్లో "
Champesaru Sir, Naa midi midi gnananiki ee last lines baga thagilayi. adbhutham.
please post your new poems
రిప్లయితొలగించండి