3, మార్చి 2014, సోమవారం

చీకటిపాట 


చీకటిరోజుల్లో గానాలుండవా 
ఉండకేం 
చీకటిరోజుల గురించి గానాలుంటాయి 
                            -----------     బెర్టోల్ట్ బ్రెహ్ట్

ఎంత పురోభివృద్ధి  !!
ఎప్పుడు పోయివస్తుందో తెలియని వెలుగు ,
నెలనెలా తప్పని తద్దినం .

యధాతధంగా కిరోసిన్ బుడ్డి
రెపరెపలాడుతూ కొవ్వొత్తి
లేదూ లల్లాయి బుడ్డి  .

 పునరావృతం
నా తండ్రితాతల వారసత్వం
నోట్లోముద్ద గూట్లోదీపం
ఆహా ! ఏమి నా భాగ్యం !
                                                            22-07-2005 .

(  చీకటి అన్నాక ఏదైనా కావచ్చు . ఇదో రకం చీకటి . మనం పురోగమిస్తున్నామా ? తిరోగమిస్తున్నామా ? )

           ఈ కవితని ఈ శీర్షికని ప్రారంభించిన శ్రీ కంచర్ల సుబ్బానాయుడు గారికే గౌరవంతో అంకితమిస్తున్నాను.                     


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి